News June 12, 2024
బక్రీద్ సందర్భంగా జంతుబలులు చేయరాదు: జనగామ కలెక్టర్

నిబంధనలకు అనుగుణంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్, సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ యానిమల్స్ నిబంధనలకు అనుగుణంగా, ఆర్టికల్-48 ప్రకారం పశుజాతుల రక్షణ, జంతువుల వధించుట నిషేధమన్నారు. ముస్లిం సోదరులందరూ శాంతి యుతంగా, ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.
Similar News
News October 26, 2025
సోమవారం ‘ప్రజావాణి’ రద్దు: వరంగల్ కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం(అక్టోబర్ 27) నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆమె సూచించారు.
News October 26, 2025
భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: WGL కలెక్టర్

భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో వర్ధన్నపేట, దుగ్గొండి మండలాల భూభారతి, పీఓటీ రికార్డులపై ఆమె సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ను వేగవంతం చేయాలని, దరఖాస్తులను తిరస్కరించే పక్షంలో అందుకు స్పష్టమైన కారణాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
News October 25, 2025
ఎస్ఐఆర్ ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలి: సి.సుదర్శన్ రెడ్డి

ఎస్ఐఆర్ ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన 2002 ఎస్.ఐ.ఆర్. డేటాను 2025 జాబితాతో మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా స్థితిగతులను వివరించారు. బి.ఎల్.ఓ. యాప్‌పై వివరణ ఇచ్చారు.


