News June 12, 2024

బక్రీద్ సందర్భంగా జంతుబలులు చేయరాదు: జనగామ కలెక్టర్

image

నిబంధనలకు అనుగుణంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్, సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ యానిమల్స్ నిబంధనలకు అనుగుణంగా, ఆర్టికల్-48 ప్రకారం పశుజాతుల రక్షణ, జంతువుల వధించుట నిషేధమన్నారు. ముస్లిం సోదరులందరూ శాంతి యుతంగా, ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.

Similar News

News March 26, 2025

KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

News March 26, 2025

నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం పాత ఆజంజాహీ మిల్ గ్రౌండ్లో 16.7 ఎకరాలలో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న జీ ప్లస్ టూ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు బ్లూ ప్రింట్ మ్యాప్ ప్రకారం పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News March 26, 2025

వరంగల్: అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

మామూనూర్ ఎయిర్‌పోర్టు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పనుల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సత్య శారదా దేవి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కార్యాచరణ ప్రణాళిక పురోగతిపై అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనుల్లో భూమి కోల్పోయిన రైతులకు, భూముల అవార్డింగ్ పాస్ అయిన వారికి డబ్బులు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

error: Content is protected !!