News March 8, 2025

బజార్హత్నూర్‌లో నీటి సమస్యపై స్పందించిన మాజీ మంత్రి

image

వేసవికాలం ప్రారంభం మొదలు తాగునీటి కోసం గిరిజనులకు తిప్పలు తప్పడంలేదు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బజార్హత్నూర్ మండలం చింతకర్రలో మిషన్ భగీరథ నీళ్లు అందక ఆ గ్రామస్తులు వ్యవసాయ బావి నుంచి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కనీసం నీటి సమస్యను పరిష్కరించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైందని, బజార్హత్నూర్‌లో నీటి సమస్యపై మాజీ మంత్రి ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు

Similar News

News March 21, 2025

ADB: ACB కేసులో తప్పుడు సాక్ష్యం.. ముగ్గురిపై కేసు

image

కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ముగ్గురి పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ACB స్పెషల్ కోర్టు జడ్జీ తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 2010లో లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) రేగుంట స్వామి కేసులో ఇచ్చోడ మండలానికి చెందిన కన్నమయ్య, నారాయణ, మల్లయ్య తప్పుడు సాక్ష్యం చెప్పారు. దీంతో వారిపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది.

News March 21, 2025

ADB: BC స్టడీ సర్కిల్ ఘనత.. గ్రూప్స్‌లో సత్తాచాటిన 25 మంది

image

ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్స్ ఫలితాల్లోమంచి మార్కులు సాధించిన వారిని అభినందించారు. గ్రూప్-1 లో ఏడుగురు, గ్రూప్ 2లో 15 మంది, గ్రూప్-3 లో ఐదుగురు మంచి మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్‌లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.

News March 21, 2025

నార్నూర్ వాసికి CM ద్వారా నియామకపత్రం

image

నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ సూరజ్ సింగ్-ప్రణీత దంపతుల కుమారుడు బానోత్ సోను సింగ్ ఇటీవల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఉద్యోగ నియామకపత్రాన్ని అందజేసి అభినందించారు. కార్యక్రమంలో వేణుగోపాల్, బంజారా నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!