News August 7, 2024
బజార్‌హత్నూర్: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం
బజార్‌హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో పర్యటనకు వచ్చిన రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భొజ్జు పటేల్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామన్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఎ పీఓ ఖుష్బూ గుప్తా అధికారులు నేతలు పాల్గొన్నారు.
Similar News
News September 11, 2024
కాంగ్రెస్ నేతను పరామర్శించిన బీజేపీ ఎంపీ
ఏఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు జాదవ్ నరేష్‌ను అదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం గణేష్ పరామర్శించారు. గుడిహత్నూర్ మండలం తోషం తండ కు చెందిన జాదవ్ నరేష్ అన్నయ్య జాదవ్ చందూలాల్ ఇటీవల మృతి చెందారు. విషషయం తెలుసుకున్న ఎంపీ నరేష్ కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించి, మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ఎంపీ వెంట
బీజేపీ నాయకులు వామన్ గిత్తే, చంద్రకాంత్, నారాయణ తదితరులు ఉన్నారు.
News September 10, 2024
ADB: ‘క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు’
క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 10 ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక రిమ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. ఆత్మహత్యలకు పాల్పడటం వల్ల వారి కుటుంబాలు చిన్న భిన్నమవుతాయన్నారు. ఉచిత కౌన్సెలింగ్ కొరకు 14416 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News September 10, 2024
ADB: నోటితో విషం తీసి విద్యార్థి ప్రాణం కాపాడిన టీచర్
విద్యార్థిని పాము కాటేయడంతో వెంటనే ఓ ఉపాధ్యాయుడు నోటితో విషం తొలగించి విద్యార్థి ప్రాణాన్ని కాపాడాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోర ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 1వ తరగతి విద్యార్థి యశ్వంత్‌ని పాము కాటేసింది. వెంటనే ఉపాధ్యాయుడు సురేశ్ నోటితో విషం తీసేసి విద్యార్థి ప్రాణం కాపాడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆయన్ను పలువురు అభినందించారు.