News February 10, 2025

బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్: తమ్మినేని

image

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉందని ఖమ్మం మాజీ ఎంపీ, సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణను విస్మరించిందని, రైతును, వ్యవసాయనికి మరచినదని అన్నారు.

Similar News

News December 20, 2025

ఇంటి నుంచే యూరియా బుకింగ్‌: కలెక్టర్‌

image

రైతులు యూరియా కోసం ఇబ్బంది పడకుండా రూపొందించిన కొత్త యాప్‌పై కలెక్టర్ అనుదీప్ మంగళవారం సమీక్షించారు. రబీ సీజన్ నుంచి రైతులు తమ ఇంటి వద్ద నుంచే మొబైల్ యాప్ ద్వారా యూరియాను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్‌లో డీలర్ల వద్ద ఉన్న నిల్వల (స్టాక్) వివరాలను కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని పేర్కొన్నారు.

News December 20, 2025

ఖమ్మం ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 22న మచిలీపట్నం నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లే వన్-వే స్పెషల్ రైలు (07401)కు ఖమ్మం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైలు గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణిస్తూ ఖమ్మం చేరుకుంటుంది. ఇక్కడితో పాటు వరంగల్ స్టేషన్‌లోనూ ఈ రైలు ఆగుతుందని అధికారులు వెల్లడించారు.

News December 20, 2025

ఖమ్మం: ‘ఆమె’దే హవా

image

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మహిళలు సత్తాచాటారు. మొత్తం 566 జీపీలకు గాను 297 స్థానాలు మహిళలు గెలిచారు. కాగా అత్యధికంగా తిరుమలాయపాలెంలో 40 జీపీలు ఉంటే 22, రఘునాథపాలెంలో 37 జీపీలకు 20 జీపిల్లో మహిళలు విజయం సాధించారు. అలాగే వైరా నియోజకవర్గంలో జనరల్ స్థానాల్లో ఐదుగురు బీసీ, ముగ్గురు ఎస్టీ మహిళలు, సత్తుపల్లిలో ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ మహిళ అభ్యర్థి విన్ అయ్యారు.