News February 10, 2025
బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్: తమ్మినేని

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉందని ఖమ్మం మాజీ ఎంపీ, సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణను విస్మరించిందని, రైతును, వ్యవసాయనికి మరచినదని అన్నారు.
Similar News
News February 9, 2026
ఖమ్మం: ఏకంగా జిల్లా జైలుకే ‘కుళ్లిన మటన్ SUPPLY’

ఖమ్మం నగరంలోని మూడు బొమ్మల సెంటర్ వద్దగల ఓ మటన్ షాపుపై మున్సిపల్ అధికారులు మెరుపు దాడి చేశారు. డీప్ ఫ్రిజ్లో నిల్వ ఉంచిన 30 కేజీల కుళ్లిపోయిన, దుర్వాసన వస్తున్న మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. కాగా, సదరు మటన్ యజమాని జిల్లా జైలుతో పాటు పలు హోటళ్లకు మాంసం సరఫరా చేసే కాంట్రాక్టర్‌గా ఉండటం గమనార్హం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News February 9, 2026
ఖమ్మం: ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. దీంతో ఇన్ని రోజులుగా సందడి చేసిన మైకులు, ప్రచార రథాలు మూగబోయాయి. 11న పోలింగ్ జరిగే వరకు సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుంది. శాంతిభద్రతల దృష్ట్యా అధికారులు వైన్ షాపులను మూసివేయించారు. ప్రచారంలో మూడు(కాంగ్రెస్, BRS, BJP) పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో శ్రమించాయి. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారనేది తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.
News February 9, 2026
ఖమ్మం: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజల నుంచి వినతులను నేరుగా స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. ప్రజలు సమర్పించిన అర్జీలను ఎప్పటికప్పుడు శాఖల వారీగా పరిశీలిస్తూ, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు న్యాయం చేయాలన్నారు.


