News March 11, 2025
బడిలో బాలిక మృతి.. ITDA PO వివరణ ఇదే

ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలిక మృతపై ITDA PO కుష్బూ గుప్తా వివరణ ఇచ్చారు. బాలికకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. ఇటీవల వైద్య శిబిరంలోనూ ఆమెకు పరీక్షలు చేయగా ఎలాంటి సమస్యలు ఉన్నట్లు తేలలేదన్నారు. డాక్టర్ల ప్రాథమిక అభిప్రాయం ప్రకారం విద్యార్థిని శ్వాసకోస సంబంధిత సమస్యతో మృతి చెంది ఉండవచ్చని పేర్కొన్నారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు.
Similar News
News March 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు

ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నంవార్ శంకర్ రూ.50 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు) నిర్మాణ స్థలంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఆయనను పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 11, 2025
ADB: బిహార్ ముఠా.. నిందితుల వివరాలు

ఆదిలాబాద్ జిల్లాలో పాత మొబైల్ ఫోన్లకు ఆయా వస్తువులు అమ్ముతున్న <<15720691>>బిహార్ ముఠా<<>> వివరాలను మంగళవారం పోలీసులు వెల్లడించారు. A1గా తబరాక్, A2 మొహమ్మద్ మెరాజుల్, A3 మహబూబ్ ఆలం, A4 మొహమ్మద్ జమాల్, A5 ఉజీర్, A6గా అబ్దుల్లాగా గుర్తించారు. దీంతో సోమవారం సాయంత్రం బస్సు స్టాండ్ సరిహద్దుల్లో A3 నుంచి A6 వరకు మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
News March 11, 2025
ADB: రేపు జిల్లా స్థాయి హాకీ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం జిల్లా స్థాయి సీనియర్ పురుషుల హాకీ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి తెలిపారు. స్టేడియంలో సాయంత్రం 5గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని, ఆసక్తిగల క్రీడాకారులు శిక్షకుడు రవీందర్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు.