News June 12, 2024
బడి ఈడు ఉన్న ప్రతి పిల్లవాడు బడిలోనే ఉండాలి: జిల్లా కలెక్టర్

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి చందన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి ఈడు ఉన్న ప్రతి పిల్లవాడు, అమ్మాయి బడిలో ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, వారికీ అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 26, 2025
NLG: సన్న బియ్యం పంపిణీకి చకచకా ఏర్పాట్లు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డుబియ్యం మొత్తం వెనక్కి పంపించాలని సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే గోదాముల్లో బియ్యం సిద్ధంగా ఉంచిన అధికారులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వాటిని రేషన్ షాపులకు తరలించి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
News March 26, 2025
NLG: ధాన్యం కొనుగోళ్లకు కసరత్తు

నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది యాసంగిలో ఏప్రిల్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని రైతుల నుంచి విమర్శలు రాగా.. ఈసారి ఆ సమస్య రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ఈ సీజన్లో 11.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 12.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు.
News March 26, 2025
సీజన్ ముగిసిన.. రైతుకు దక్కని భరోసా!

నల్గొండ జిల్లాలో రైతు భరోసా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటివరకు యాసంగి సీజన్‌కు సంబంధించి మూడెకరాల లోపు 2, 76,694 మంది ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం నిధులు జమ చేసింది. మూడు ఎకరాలకు పైగా ఉన్న సుమారు 3. 30 లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సీజన్ ముగిసినా ఎప్పుడు ఇస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.