News June 20, 2024

బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలి: DEO

image

5 నుంచి15 సంవత్సరాల పిల్లలు అందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలని అల్లూరి జిల్లా DEO బ్రహ్మాజీరావు అధికారులను, హెచ్‌‌ఎం‌లను ఆదేశించారు. రంపచోడవరంలో గురువారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతీ ఉపాధ్యాయుడు, విద్యార్థుల హాజరు నిర్ణీత సమయంలో వేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News October 4, 2024

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC అభ్యర్థిగా గోపి మూర్తి

image

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఉపఎన్నికకు పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్రా. గోపి మూర్తిని యుటీఎఫ్ బలపరిచింది. ఈ మేరకు ఆయన్ను బరిలో ఉంచాలని నిర్ణయించింది. ఈయన ప్రస్తుతం యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

News October 4, 2024

తూ.గో: 7న కాకినాడలో జాబ్ మేళా

image

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈనెల 7న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కాకినాడలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. 7న ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభం అవుతుందని తెలిపారు.

News October 4, 2024

ఏపీ టూరిజం డెవలప్మెంట్ డైరక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరక్టర్‌గా నియమితులైన గంటా స్వరూప్ దేవి శుక్రవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, అభిమానులు మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సంధర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు స్వరూప దేవికి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.