News May 20, 2024

బ‌డి పంతుళ్ల‌పై లాఠీలు.. రేవంత్ పాల‌న‌పై హ‌రీశ్‌రావు ధ్వజం

image

బ‌డి పంతుళ్ల‌పై లాఠీలు.. బ‌డుగు జీవుల‌కు జూటా హామీలు..ఇదీ రేవంత్ పాల‌న అంటూ మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. దేవ‌ర‌కొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి ఇటీవల మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ దేవ‌ర‌కొండ‌కు హ‌రీశ్‌రావు వెళ్లి ర‌వీంద్ర కుమార్ తండ్రి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా దేవ‌ర‌కొండ‌లో హ‌రీశ్‌ మీడియాతో మాట్లాడారు.

Similar News

News December 11, 2024

డిసెంబర్ 15వ తేదీన జిల్లాకు విశారదన్ మహారాజ్ రాక

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలో డిసెంబర్ 15న జరిగే ధర్మ సమాజ్ పార్టీ (DSP) జిల్లా మహాసభ (ప్లీనరీ)కి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధినేత విశారదన్ మహారాజ్ హాజరవుతారని జిల్లా అధ్యక్షుడు సదన్ మహరాజ్ తెలిపారు. బుధవారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 93 శాతం మంది బీసీ, ఎస్సీ ఎస్టీ, అగ్ర కుల పేదల తరఫున పోరాడే ఏకైక పార్టీ ధర్మ సమాజ్ అన్నారు.

News December 11, 2024

పారదర్శక పాలన అందించాలి: మంత్రి పొన్నం

image

పారదర్శక పాలన అందించాలని నూతన పాలకవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. పారదర్శక పాలనతో ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.

News December 11, 2024

మెదక్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. వివరాలిలా.. హుస్నాబాద్ మండలం పొట్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీధర్ ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకున్నాడు. అదే విధంగా దుబ్బాక పరిధిలోని ధర్మాజీపేట వాడకు చెందిన నర్సింలు(42) అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్నూర మండలం నస్తీపూర్‌కి చెందిన కుమార్‌పై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సూసైడ్ చేసుకున్నాడు.