News March 2, 2025

బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదు: అవినాష్

image

బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైపీసీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారు. అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రైతులు, మహిళలు, యువత అన్నివర్గాలను విస్మరించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదన్నారు.

Similar News

News October 18, 2025

ప్రకాశం జిల్లాలో పోలీసుల దాడులు

image

జిల్లాలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న వారిపై శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కనిగిరి–1, మద్దిపాడు–1, పామూరు–2, వెలిగండ్ల–1, మార్కాపురం టౌన్–1 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి రూ.1,38,944 విలువ గల బాణాసంచాలు సీజ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 18, 2025

HYDలో సూర్యాపేట జిల్లా వాసి SUICIDE

image

సూర్యాపేట జిల్లా ఎర్కారానికి చెందిన బొర్రా నరేష్(22) అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలోని కవాడిపల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలింనగర్‌లో నివాసముంటున్న నరేష్ ఆర్థిక, మానసిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ 29న సోదరుడు నవీన్‌కు ఫోన్ చేసి, దుబాయ్ వెళ్తున్నట్లు చెప్పాడు. దీంతో సెప్టెంబర్ 30న నవీన్ రాయదుర్గం PSలో ఫిర్యాదు చేయగా, ఈ రోజు SUICIDE చేసుకున్నాడు.

News October 18, 2025

APకి కొత్తగా 106 PG మెడికల్ సీట్లు: సత్యకుమార్ యాదవ్

image

AP: ప్రభుత్వ PG వైద్య విద్యలో అదనంగా 106 సీట్ల భర్తీకి NMC ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గైనిక్, పీడియాట్రిక్, ఎనస్థీషియా, రేడియాలజీ విభాగాల్లో ఈ సీట్లున్నాయి. ఇందులో 60 సీట్లు 5 కొత్త కాలేజీలకు వస్తున్నాయి. గతేడాది ప్రభుత్వం అదనపు సీట్ల మంజూరుకు ప్రతిపాదన పంపింది. దీనిపై మంత్రి సత్యకుమార్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో స్వయంగా మాట్లాడారు. దీంతో కొత్త మెడికల్ సీట్లు మంజూరయ్యాయి.