News July 29, 2024

బడ్జెట్‌పై భయమెందుకు బాబూ: మాజీ మంత్రి ధర్మాన

image

మోసపూరిత హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. ఈ మేరకు సోమవారం ఆయన పోలాకిలో ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా మరో 3 నెలలు ఓటాన్ అకౌంట్‌కు వెళ్లిందన్నారు. సూపర్ సిక్స్‌ను అమలు చేయకుండా ఉండేందుకు ఆయన కొత్త ఎత్తుగడ వేశారన్నారు. 

Similar News

News October 7, 2024

శ్రీకాకుళం-విశాఖ మధ్య ప్రత్యేక రైలు

image

దసరా రద్దీ, విజయనగరం సిరిమాను ఉత్సవం సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసం ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విశాఖ-శ్రీకాకుళం ప్రత్యేక రైలు నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. 10 నుంచి16వ తేదీ వరకు విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30కి శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) చేరుకుంటుందని, మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి 4 గంటలకు విశాఖ చేరుకుంటుందని తెలిపారు.

News October 7, 2024

శ్రీకాకుళం: 129 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

image

జిల్లా అధికారులు హాజరు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి 129 అర్జీలు స్వీకరించమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలు పరిష్కారంలో అలసత్వం వహించరాదని సూచించారు. ఎప్పటి అర్జీలు అప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. బాధ్యతగా పనిచేయాలన్నారు.

News October 7, 2024

SKLM: 51 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

image

ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి, చట్ట పరిధిలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సకాలంలో బాధితులకు న్యాయం చేయాలని, సంతృప్తి చెందేలా ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో 51 ఫిర్యాదులు స్వీకరించమని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించరాదన్నారు.