News February 28, 2025

బడ్జెట్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ: బుగ్గన

image

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రభుత్వం 9నెలల్లోనే రూ.1.30లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఈ లెక్కలు బడ్జెట్‌లో లేవని అన్నారు. బడ్జెట్‌ బుక్‌లో కలర్‌ ఎక్కువ కంటెంట్‌ తక్కువంటూ ఆయన సెటైర్లు వేశారు. బడ్జెట్ ప్రసంగంలో 35 సార్లు గత ప్రభుత్వం అని చెప్పారని, ఇంకెన్ని రోజులు తమ జపం చేస్తారని మండిపడ్డారు.

Similar News

News October 19, 2025

జనగామ: కమాండ్ కంట్రోల్ యూనిట్ పర్యవేక్షణలో బోధన

image

ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు ఇంటర్ విద్య కమిషనర్ కృష్ణ ఆదిత్య ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇంటర్ బోర్డు నుంచి కమాండ్ కంట్రోల్ యూనిట్ ద్వారా బోధనను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా జనగామ జిల్లాలోని 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ సీసీటీవీ పర్యవేక్షణలోనే బోధన జరుగుతోంది.

News October 19, 2025

జనగామకు వర్ష సూచన.. రైతన్న జర జాగ్రత్త!

image

రేపు(సోమవారం) జనగామ జిల్లాకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న తరుణంలో అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లకు వరుస సెలవులు ఉండడంతో తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. టార్ఫాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలని అంటున్నారు.

News October 19, 2025

బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలి: ఎస్పీ

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలని ఎస్పీ ఎఆర్ దామోదర్ కోరారు. దీపావళి సందర్బంగా ఆదివారం జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరారు. బాణాసంచాకు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి లేదా పెద్దల పర్యవేక్షణలో కాల్చాలని కోరారు. కాటన్ దుస్తులను ధరించి మతాబులు కాల్చాలన్నారు. మతాబులు కాల్చిన తర్వాత వ్యర్దాలు సురక్షితమైన ప్రదేశాలలో వేయాలన్నారు.