News February 1, 2025

బడ్జెట్లో ఖమ్మంకు తీవ్ర అన్యాయం: సీపీఎం

image

ఖమ్మం: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ, బిహార్ ఎన్నికల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని ఆరోపించారు. జిల్లాకు నిధుల కేటాయింపుపై అన్యాయం చేశారని, దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 9, 2025

నిర్మలా సీతారామన్‌ను కలిసిన Dy.CM భట్టి

image

దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. ఆయన వెంట ఎంపీలు మల్లు రవి, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు.

News February 8, 2025

భద్రాద్రి: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

ములకలపల్లి మండలం సుబ్బనపల్లి, బండివారి గుంపులో కరెంట్ షాక్‌తో బండి వెంకటమ్మ(57) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలిలా.. వెంకటమ్మ తన నివాసంలో ఉండగా, మంచం మీద కరెంట్ వైర్ పడటంతో ఈ విషాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఇంటి నుంచి కాలిన వాసన రావడంతో సమీప ప్రజలు వెళ్లి చూడగా, అప్పటికే మృతి చెందారని తెలిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 8, 2025

క్లినికల్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి:DIEO 

image

ఇంటర్‌లో MPHW (ఫీమేల్) కోర్సు ఉత్తీర్ణులైన వారు ఏడాది క్లినికల్ అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని DIEO రవిబాబు సూచించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇచ్చే శిక్షణకు ఎంపికైన వారు రూ.వెయ్యి డీడీ అందజేయాల్సి ఉంటుందని, గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు బయోడేటాతో దరఖాస్తులను కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 15లోగా అందజేయాలన్నారు.

error: Content is protected !!