News February 2, 2025

బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం: శ్రీధర్ బాబు

image

బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే కేటాయింపులు చేశారని అన్నారు. NDA భాగస్వామ్య రాష్ట్రాలకే నిధులు ఇచ్చారని, కేంద్ర జీడీపీలో రాష్ట్రం వాటా 5 శాతం ఉన్నా.. నిధులు మాత్రం కేటాయించలేదన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా..తెలంగాణ ప్రజలకు మోదీ సర్కార్‌ ద్రోహం చేసిందన్నారు.

Similar News

News December 4, 2025

ఖమ్మం: మొదటి విడతలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలు ఇవే..!

image

ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల వివరాలను అధికారులు వెల్లడించారు. బోనకల్(M)- కలకోట, చింతకాని(M)- రాఘవాపురం, రేపల్లెవాడ, మధిర(M)- సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, వైరా(M)- లక్ష్మీపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, రఘునాథపాలెం(M)- మల్లేపల్లి, రేగులచలక, మంగ్యాతండా, రాములుతండా, ఎర్రుపాలెం(M)- గోసవీడు, చొప్పకట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్ల గౌరారం, కాచవరం.

News December 4, 2025

జిల్లాలో 3,191 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం: కలెక్టర్

image

జిల్లాలో రూ.3,191 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం జిల్లాను వేగంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్తుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ న్యూ వీసీ హాల్లో హైబ్రిడ్ మోడ్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. చేపట్టిన పనులను అధికారులు వేగంగా పూర్తి చేయాలన్నారు.

News December 4, 2025

‘విటమిన్ K’ రిచ్ ఫుడ్స్ ఇవే!

image

ఎముకలు, గుండె ఆరోగ్యానికి విటమిన్-K అవసరం. గాయాలైనప్పుడు అధిక రక్తస్రావాన్ని నివారించడానికి రక్తం గడ్డకట్టే ప్రోటీన్ల ఉత్పత్తిలో దీనిది కీలకపాత్ర. మహిళల్లో రుతుచక్రాన్ని నియంత్రించడంలోనూ సాయపడుతుంది. ఈ విటమిన్ ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, కివీ, పుదీనా, క్యారెట్, అవకాడో, ద్రాక్ష, దానిమ్మ, గుమ్మడికాయ తదితరాల్లో ‘K’ విటమిన్ మెండుగా ఉంటుంది.