News February 2, 2025
బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం: శ్రీధర్ బాబు

బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే కేటాయింపులు చేశారని అన్నారు. NDA భాగస్వామ్య రాష్ట్రాలకే నిధులు ఇచ్చారని, కేంద్ర జీడీపీలో రాష్ట్రం వాటా 5 శాతం ఉన్నా.. నిధులు మాత్రం కేటాయించలేదన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా..తెలంగాణ ప్రజలకు మోదీ సర్కార్ ద్రోహం చేసిందన్నారు.
Similar News
News February 17, 2025
SKLM: గ్రూప్ -2 పరీక్షలకు 15 పరీక్షా కేంద్రాలు

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 మెయిన్స్‌కు ఎచ్చెర్లలో మొత్తం 15పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం తెలిపారు. మొత్తం 5,535 మంది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు, పటిష్ఠమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ కేంద్రం వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ ఉండాలన్నారు.
News February 17, 2025
వరంగల్‌లో “ది స్వయంవర్”

తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ది స్వయంవర్ స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించారు. దేశంలోని 12 రాష్ట్రాల్లోని 42 నగరాల్లో 85 బ్రాంచీలతో ప్రజలకు అందుబాటులో స్పెషల్ కలెక్షన్ అందిస్తోంది ది స్వయంవర్.వివాహాది శుభకార్యాలకు అద్భుతమైన కలెక్షన్ అందించడం స్టోర్ ప్రత్యేకత. పిల్లలు, పెద్దల కోసం పట్టు పంచెలు, దుపట్టా, పైజామా, కుర్తా మొదలైన వస్త్రాలు అందుబాటు ధరల్లో అందిస్తున్నట్టు ది స్వయంవర్ యాజమాన్యం తెలిపింది.
News February 17, 2025
‘ఛావా’ మూవీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్లు!

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, నిన్న మూడో రోజు రూ.45 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి.