News February 1, 2025

బడ్జెట్‌లో తెలంగాణ ప్రయోజనాలకు విలువ లేదా..?: హరీశ్ రావు

image

2025-26 బడ్జెట్‌ను కేంద్రం తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకున్నదే తప్ప దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదని హరీష్ రావు ‘X’లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పదేపదే వల్లే వేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా..? అని ప్రశ్నించారు. ఎన్నికలున్న రాష్ట్రాలకు వరాలు ప్రకటించి లేని రాష్ట్రాలకు వివక్ష చూపడం సరికాదన్నారు. బడ్జెట్లో తెలంగాణ ప్రయోజనాలకు విలువ లేదా..? అని నిలదీశారు.

Similar News

News November 8, 2025

దేశంలోనే మొదటి పురోహితురాలు

image

సాధారణంగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు వంటివన్నీ పురుషులే చేస్తుంటారు. కానీ కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ పదేళ్లుగా పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. నందిని రెండో కూతురి వివాహానికి పురోహితుడు ఎవరూ దొరక్కపోవడంతో ఆమే పురోహితురాలిగా మారారు. ఈ నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారంటున్నారు నందిని. ఎప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనేదే తన ఉద్దేశం అని చెబుతున్నారామె.

News November 8, 2025

వరంగల్: సెలవు పెడితే ప్రభుత్వానికి గండి

image

రిజిస్ట్రార్ సెలవు పెట్టిందే తడువు మూడు రోజుల్లో 21డాక్యుమెంట్లను ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్(జూనియర్ అసిస్టెంట్) రిజిస్టర్ చేసిన ఘటన HNK(D) భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగింది. నిబంధనలకు విరుద్దంగా ఉనికిచర్లలోని 2 సర్వే నంబర్లలో నాన్ లేఅవుట్ వెంచర్లలో 15 ప్లాట్లు, 6 ఇండ్లు సహా మొత్తం 21 రిజిస్ట్రేషన్లు చేశాడు. నిబంధనల ప్రకారం నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దు.

News November 8, 2025

కొలిమిగుండ్ల: వైరల్ ఫీవర్‌తో చిన్నారి మృతి

image

కొలిమిగుండ్లలోని అంకిరెడ్డిపల్లిలో వైరల్ ఫీవర్ సోకి విద్యార్థిని మృతి చెందిన విషాదకర ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి రాజు, రామాంజినమ్మ దంపతుల కుమార్తె పద్మిని(9) నాలుగో తరగతి చదువుతోంది. వారం రోజులుగా వైరల్ ఫీవర్, కామెర్లతో బాధపడుతూ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఎంఈఓ అబ్దుల్ కలాం సంతాపం వ్యక్తం చేశారు.