News March 20, 2025

బడ్జెట్లో ములుగు జిల్లా ప్రజలకు నిరాశే!

image

తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ములుగు జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చింది. జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరైన మేడారం అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. కొత్తగా మున్సిపాలిటీగా అవతరించిన ములుగు పట్టణ అభివృద్ధి యాక్షన్ ప్లాన్‌కు బడ్జెట్లో చోటు దక్కలేదు. జిల్లాలోని యువత ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు నిధులు కేటాయించకపోవడం యువత నిరాశకు లోనయ్యారు.

Similar News

News March 21, 2025

BIG BREAKING: మంత్రి ఫరూక్ సతీమణి మృతి

image

న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని వారి ఇంట్లోనే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఇవాళ మృతి చెందారు.

News March 21, 2025

Stock Markets: ఐదో రోజూ అదుర్స్

image

స్టాక్‌మార్కెట్లు వరుసగా ఐదో సెషన్లోనూ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,266 (+78), సెన్సెక్స్ 76,580 (+238) వద్ద చలిస్తున్నాయి. ఐటీ, వినియోగం మినహా అన్ని సెక్టోరల్ సూచీలు ఎగిశాయి. రియాల్టి, హెల్త్‌కేర్, PSE, ఫార్మా, CPSE, మీడియా, ఎనర్జీ, చమురు, ఆటో, కమోడిటీస్ షేర్లకు డిమాండ్ ఉంది. బజాజ్ ఫైనాన్స్, హీరోమోటో, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, నెస్లే టాప్ గెయినర్స్. ఇన్ఫీ, HDFC బ్యాంకు, టైటాన్ టాప్ లూజర్స్.

News March 21, 2025

లాంగెస్ట్ రోడ్ నెట్‌వర్క్‌లో నల్గొండ స్థానం ఇది..!

image

రాష్ట్రంలో అత్యధిక దూరం రోడ్ నెట్‌వర్క్ కలిగిన జిల్లాల్లో నల్గొండ రెండో స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,775.56 కిలోమీటర్ల రోడ్ కనెక్టవిటీ ఉండగా.. రంగారెడ్డిలో 7,932.14 కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్ ఉంది. నల్గొండలో 7,766.92 కిలోమీటర్లు రోడ్డు కనెక్టవిటీ ఉంది. కాగా, కీలకమైన రోడ్డు డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లో నల్గొండను ఒకటిగా ఎంచుకున్నారు.

error: Content is protected !!