News March 20, 2025

బడ్జెట్.. ఉమ్మడి కరీంనగర్‌కు కేటాయింపులు ఇలా..

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో KNR స్మార్ట్ సిటీ పనులకోసం రూ.179కోట్లు కేటాయించింది. అదేవిధంగా SUకి రూ.35కోట్లు, స్పోర్ట్స్ స్కూల్‌కు రూ.21కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు రూ.349.66కోట్లు, వరదకాలువల పనులకు 299.16కోట్లు, కాళేశ్వరం రూ.2,685కోట్లు, మానేరు ప్రాజెక్ట్‌కు రూ.లక్ష, బొగ్గులవాగు(మంథని)రూ.34లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్‌కు రూ.2.23కోట్లను కేటాయించింది.

Similar News

News April 21, 2025

జనగామ: సభను పండుగలా నిర్వహించుకుందాం: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

image

బీఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభను పండుగలా నిర్వహించుకుందామని జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు కేసీఆర్ స్వర్ణ యుగం లాంటి పాలనను అందించారని, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని అన్నారు.

News April 21, 2025

కుప్పంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కరించడం లక్ష్యంగా కుప్పంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడ పిడి వికాస్ మర్మత్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10.గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏమైనా సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. అర్జీదారులు సద్వినియోగం చేసుకొవాలి

News April 21, 2025

అమలాపురం: నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్ నిర్వహణ

image

అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఆయన ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10.గంటల నుంచి మధ్యాహ్నం 1.గంట వరకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈపీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

error: Content is protected !!