News July 26, 2024

బడ్జెట్ కేటాయింపుల్లో ఖమ్మం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ

image

డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ కేటాయింపుల్లో ఖమ్మం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. నీటిపారుదల, అటవీ, రోడ్లు, పంచాయతీరాజ్ శాఖల్లో పెండింగ్ పనులకు నిధులు కేటాయించారు. తద్వారా జిల్లాలోని సీతారామ, వైరా, లంకాసాగర్ ప్రాజెక్టుల పనులు ఊపందుకోనున్నాయి. అలాగే, ఎర్రుపాలెం మండలంలో ప్రత్యేకంగా ఎత్తిపోతలకు నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు.

Similar News

News February 24, 2026

పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: సీఎస్‌

image

ఖమ్మం జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి

image

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూ. 1.25 కోట్ల భారీ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపు సహా పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపినట్లు వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.