News November 12, 2024
బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చింది: MLC పర్వత రెడ్డి
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రైతు పెట్టుబడి సాయం హామీపై కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం రూ.10 వేల కోట్లు అవసరమైతే రూ.4,500 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. నిరుద్యోగ భృతిపై ప్రస్తావనే చేయలేదన్నారు.
Similar News
News December 6, 2024
జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: కలెక్టర్
జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పర్యాటక, దేవాదాయ, అటవీశాఖ పరిధిలోని దర్శనీయ ప్రదేశాల పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్లో వికీపీడియాలో అప్లోడ్ చేయాలని సూచించారు.
News December 6, 2024
నెల్లూరు జిల్లాలో ‘పుష్ప-2’ అరుదైన రికార్డ్
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా నెల్లూరు జిల్లాలో ఓ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. జిల్లా వ్యాప్తంగా 58 థియేటర్లలో ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజు పూర్తి అయ్యే సమయానికి ఒక్కో థియేటర్‌లో 8 షోల చొప్పున 464 షోలు ప్రదర్శితమయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మొదటి రోజు నుంచే ‘పుష్ప-2’ రికార్డులు మొదలయ్యాయని అభిమానులు సంబరపడుతున్నారు.
News December 6, 2024
పండగ వాతావరణంలో మెగా PTM ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
డిసెంబర్ 7న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి చేసినట్లు కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా పండగ వాతావరణంలో జరిగేలా ఇప్పటికే సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రేపటి నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.