News November 29, 2024

బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన GHMC

image

బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు GHMC సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌‌ని రూ.8,600 కోట్లతో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట బడ్జెట్‌ ప్రతిపాదనపై మేయర్‌ అధ్యక్షతన జరిగే స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో సభ్యులు చర్చించి, ఆ తర్వాత సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. కాగా, 2024-25 బడ్జెట్‌ రూ.7,937 కోట్లు. దీనిపై మీ కామెంట్?

Similar News

News December 1, 2024

HYDలో పుష్ప-2 ప్రీ రిలీజ్ EVENT.. ట్రాఫిక్ ఆంక్షలు!

image

HYDలోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో డిసెంబర్ 2న సా.4 నుంచి రా.10 వరకు అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాగుట్ట, యూసఫ్‌గూడ, కృష్ణానగర్, మోతీనగర్, బోరబండ, జూబ్లీహిల్స్, మైత్రివనంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. జానకమ్మ తోటలో జనరల్ పబ్లిక్ వాహనాల పార్కింగ్ కాగా సవేరా, మహమ్మద్ ఫంక్షన్ హాళ్లలో ఓన్లీ 4 వీలర్ పార్కింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు.

News December 1, 2024

HYD: రహదారులపై మతాల చిహ్నాలు తొలగించాలి: సంఘ సేవకులు

image

రహదారులపై వివిధ మతాల చిహ్నాలు రోడ్డుకు అడ్డంగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడి నుంచి తరలించాలని ప్రముఖ సంఘ సేవకులు గంజి ఈశ్వర్ లింగం, టీ.రమేశ్ కోరారు. సిటిజన్స్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘రహదారులపై ఆటంకాలు, ప్రత్యామ్నాయాలు’ అనే అంశంపై ప్రత్యేక సమావేశం కమలానగర్‌లో ఆదివారం నిర్వహించారు. కోమటిరవి, యాదగిరిరావు, కర్రం మల్లేశం ఉన్నారు.

News December 1, 2024

HYD: వాహనాలపై ఇనుప చువ్వలు తరలిస్తున్నారా? జాగ్రత్త..!

image

వాహనాలపై ఇనుప చువ్వలు తరలించే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని HYD ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇటీవల కూకట్‌పల్లి JNTUH మార్గంలో వాహనంపై నుంచి ఇనుప చువ్వలు కింద పడ్డాయి. అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదు. కానీ.. వాహనంపై నుంచి ఇనుప చువ్వలు వేరే వ్యక్తులపై పడితే తీవ్ర ప్రమాదం జరిగేదన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.