News February 2, 2025
బడ్జెట్ భేష్: మంత్రి సవిత

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌పై మంత్రి సవిత ప్రశంసలు కురించారు. బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు ప్రధాని మోదీకి, సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు, పోలవరానికి బడ్జెట్ ఊపిరిపోసిందని తెలిపారు.
Similar News
News February 13, 2025
రేషన్ కార్డులు.. ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఫిర్యాదు చేయండిలా!

TG: రేషన్ కార్డు దరఖాస్తు కోసం మీ-సేవ నిర్వాహకులు రూ.50 మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయా సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణ జరిపి వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ఎవరైనా ఎక్కువ డబ్బులు తీసుకుంటే మీ-సేవ హెల్ప్ లైన్ నంబర్ 1100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
News February 13, 2025
ప.గో : కోళ్ల నుంచి కుక్కలకు.. మనుషులకు సోకే ఛాన్స్

ఉమ్మడి ప.గో జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇదే క్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలలో కుక్కలు కూడా చర్మవ్యాధులతో దర్శనమిస్తున్నాయి. అయితే కోడి వ్యర్థాలు తినడం వలనే కుక్కలు ఈ విధంగా బాధపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. గాలి ద్వారా ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
News February 13, 2025
గుంటూరు: 30 మంది నామినేషన్‌ల ఆమోదం

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ముగిసింది. గుంటూరు కలెక్టరేట్‌లో బుధవారం అభ్యర్థుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎన్నికల పరిశీలకులు కరుణ, కలెక్టర్ నాగలక్ష్మి నామినేషన్ల పరిశీలన చేపట్టారు. మొత్తం 40 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 10 మంది అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. 30 మంది నామినేషన్లను ఆమోదించారు.