News July 25, 2024
బడ్జెట్ విందు సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు

రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నివాసంలో గురువారం బడ్జెట్ విందును ఏర్పాటు చేశారు. విందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News December 9, 2025
KNR: నకిలీ బ్యాలెట్ పత్రాలు.. సర్పంచ్ అభ్యర్థి సహా నలుగురిపై కేసు

మానకొండూరు మండలం చెంజర్లలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ నకిలీ నమూనా బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేసినందుకు సర్పంచ్ అభ్యర్థి గడ్ది రేణుక(కత్తెర గుర్తు)తో సహా నలుగురిపై కేసు నమోదైంది. వీరు ఫుట్‌బాల్ గుర్తు అభ్యర్థి సీరియల్ నంబర్‌ను తప్పుగా ముద్రించి, NOTA స్థానంలో సరైన సీరియల్ నంబర్‌ను ఉంచి ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
News December 9, 2025
KNR కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

కరీంనగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొత్తం 104 క్లస్టర్లలో పెట్రోలింగ్‌తో పాటు, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
News December 9, 2025
‘ఐదుగురు, అంతకంటే ఎక్కువమంది గుమికూడొద్దు’

కరీంనగర్ తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. రూరల్ డివిజన్లోని ఐదు మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఈ ఉత్తర్వులు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి DEC 11 రాత్రి 11:59 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.


