News June 30, 2024

బతికున్నంత కాలం నిజాయితీగానే బతుకుతా: MLA వరద

image

తాను బతికున్నంత కాలం నిజాయితీగా బతికి చనిపోతానని MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు గీతాశ్రమంలో విశ్వహిందూ పరిషత్, ABVP, RSS, శివ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు అభినందన సభ నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మిస్తామన్నారు. దేవాలయాల ఆస్తులను కాపాడుతానని, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పట్టణంలో రోడ్ల వెడల్పుకు రాజీ పడకుండా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

Similar News

News September 21, 2024

కోడూరు: మృత్యువుతో పోరాడి చిన్నారి మృతి

image

ఓ చిన్నారి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. రైల్వే కోడూరుకు చెందిన కొక్కంటి మహేశ్ మూడు రోజుల క్రితం తండ్రి పెద్ద కర్మ పనుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో మహేశ్ కూతురు లాస్య(4) ప్రమాదవశాత్తు వంట పాత్రలో పడింది. గమనించిన బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న MLA శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

News September 21, 2024

పెనగలూరు: పోరాడి ప్రియుడిని పెళ్లి చేసుకుంది

image

ప్రేమించిన ప్రియుడి కోసం ఓ యువతి పోరాడి సాధించింది. పెనగలూరు మండలం ఈటిమార్పురానికి చెందిన పొసలదేవి లావణ్యను ప్రేమించిన యువకుడు బైర్రాజు వెంకట సాయి వివాహం చేసుకున్నారు. తనను ప్రేమించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని పురుగు మందు తాగి చచ్చిపోతానంటూ లావణ్య పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం బైఠాయించింది. అయితే ఎట్టకేలకు రాజంపేటలో పెద్దల సమక్షంలో వెంకట సాయి లావణ్యను పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమైంది.

News September 21, 2024

వైద్య సేవలో కడప జిల్లాకు ఏ గ్రేడ్

image

ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించుటలో కడప జిల్లా ఏ గ్రేడ్ సాధించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ నాగరాజు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య సేవలు తీసుకున్న వారు, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వారు, సాధారణ ప్రసవాలు, రక్తపరీక్ష తదితర విభాగాలలో ఆరోగ్య సేవలు అందించే విధానంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొందినట్లు వెల్లడించారు.