News February 7, 2025
బతికున్న మనిషికి డెత్ సర్టిఫికెట్..!

మనిషి బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికెట్ సృష్టించిన ఘటన బూర్గంపాడు మండలం సారపాకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భాస్కర్ నగర్‌కు చెందిన భూక్య శ్రీరాములు పేరున ఉన్న ఎల్ఐసీ బీమా డబ్బులను కాజేసేందుకు ఏజెంట్ ఏకంగా డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఆ సర్టిఫికెట్ ద్వారా పది లక్షల భీమా సొమ్ము పొంది బాధితుడికి 3.5 లక్షలు ఇచ్చి మిగతావి ఏజెంట్ కాజేశాడు. విషయం బయటికి రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.
Similar News
News December 12, 2025
నవోదయ పరీక్షలకు పటిష్ట బందోబస్తు: వనపర్తి ఎస్పీ

శనివారం జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు వనపర్తి జిల్లాలో 5 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1,340 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉ 11:30 నుంచి మ. 1:30 గ.ల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
News December 12, 2025
ఇతిహాసాలు క్విజ్ – 94 సమాధానం

ఈరోజు ప్రశ్న: పైన చిత్రంలో ఉన్న మహాభారత పాత్ర ఎవరిది? ఆయనను ఎవరు చంపారు?
సమాధానం: పైన చిత్రంలో ఉన్నది గాంధారికి సోదరుడు, దుర్యోధనుడికి మేనమామ అయిన ‘శకుని’. మహాభారతంలో ఈయన కౌరవుల పక్షాన ఉంటాడు. పాండవులపై కుట్రలు పన్నుతాడు. పాచికల ఆటలో మోసం చేసి, పాండవుల రాజ్య నాశనానికి, ద్రౌపది అవమానానికి కారణమవుతాడు. దీనికి ప్రతీకారంగా కురుక్షేత్రంలో సహదేవుడు శకునిని సంహరిస్తాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 12, 2025
మా గ్రామానికి రోడ్డు వేయండి: పవన్‌తో కెప్టెన్ దీపిక

మహిళల అంధుల క్రికెట్ జట్టుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం భేటీ అయ్యారు. ప్రపంచకప్ సాధించిన క్రికెటర్లకు అభినందనలు తెలిపారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షలు, ట్రైనర్లకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని తన గ్రామమైన తంబలహట్టి తండాకు రోడ్డు వేయాలని కెప్టెన్ దీపిక కోరగా పవన్ తక్షణ చర్యలకు ఆదేశించారు.


