News October 3, 2024
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి
తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ ప్రతీక అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి ఆలయంలో బుధవారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాగా.. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు.
Similar News
News November 8, 2024
కరీంనగర్ జిల్లాలోని రేషన్ వివరాలు
కరీంనగర్ జిల్లాలోని రేషన్ వివరాలు కింది విధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 8,17,156 యూనిట్ల పరిధిలో మొత్తం 2,76,620 రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం 566 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెల దాదాపు 49 లక్షల కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
News November 8, 2024
FLASH.. KNR: గోదావరిలో యువకుడు గల్లంతు
గోదావరి నదిలో నీట మునిగి యువకుడు గల్లంతైన ఘటన శుక్రవారం మల్లాపూర్ మండలం వివిరావుపేట గోదావరి నదిలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన శ్రీవర్ధన్(18) మేనకోడలు పుట్టు వెంట్రుకల శుభకార్యానికి గోదావరికి వచ్చారు. ఈ క్రమంలో స్నానం చేసేందుకు నదిలోకి వెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగిపోవడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 8, 2024
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సత్యనారాయణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యవసాయ క్షేత్రంలో వరి నాటుతో వేసిన రేవంత్ రెడ్డి ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.