News March 29, 2024
బత్తలపల్లి: టెన్త్ విద్యార్థిని సూసైడ్

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. బత్తలపల్లికి చెందిన సృజన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కడుపు నొప్పి ఎక్కువై భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 4, 2025
పోలీస్ పీజీఆర్ఎస్కు 105 పిటిషన్లు: ఎస్పీ

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
News November 3, 2025
పెడపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ రంగాను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వారిని ఢీ కొన్న కారు ధర్మవరం వైపు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.