News February 7, 2025

బత్తలపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ రత్న

image

బత్తలపల్లి పోలీస్ స్టేషన్‌ను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తనిఖీ చేసింది. శుక్రవారం ఆమె స్టేషన్లోకి రావడంతో ఎస్ఐ సోమశేఖర్, సిబ్బంది ఎస్పీకి సెల్యూట్ కొట్టి స్వాగతించారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణలో పోలీసులు ప్రముఖ పాత్ర పోషించాలని సూచించారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్, బత్తలపల్లి సీఐ ప్రభాకర్, ఎస్‌ఈబీ ఎస్ఐ ప్రదీప్ కుమార్ ఉన్నారు.

Similar News

News December 13, 2025

రేపు సూర్యపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేతిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

News December 13, 2025

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>స్పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా 11 చీఫ్ కోచ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా లేదా ఒలింపిక్స్ /పారాలింపిక్స్/ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నవారు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.nic.in

News December 13, 2025

సైబర్‌ నేరగాళ్లపై కరీంనగర్‌ సీపీ ఉక్కుపాదం

image

టెక్నాలజీపై పట్టున్న కరీంనగర్ CP గౌస్ ఆలం ఆర్థిక నేరగాళ్లను వేటాడుతున్నారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసును చేధిస్తూ బాధితులలో భరోసా నింపుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేటా ఫండ్ కింగ్ పిన్ లోకేశ్వర్‌ను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 281 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.90,77,918 రికవరీ చేసి బాధితులకు అందించారు.