News February 10, 2025
బత్తలపల్లి విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

విజయవాడలో ఆదివారం రాష్ట్ర స్థాయిలో వేదిక్ మ్యాథ్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వేదిక్ మ్యాథ్స్ లెవెల్-2 విభాగంలో బత్తలపల్లికి చెందిన విద్యార్థిని అద్విక ద్వితీయ బహుమతి గెలుచుకుంది. అనంతరం విశ్వం సీఈవో హరిచరణ్ చేతులపై ప్రశంసా పత్రం, కప్పు అందుకుంది. హైద్రాబాద్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయిందని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ తెలిపారు.
Similar News
News October 17, 2025
విజయవాడ: విద్యార్థి మృతిపై అనుమానాలు

సింగ్ నగర్లో 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. బాత్రూమ్లో 2 అడుగుల ఎత్తులో ఉన్న హ్యాంగర్కు ఉరి వేసుకున్నట్లు కనిపించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా యశ్వంత్ పేరెంట్స్ విడిపోయారు. తల్లికి క్యాన్సర్ కావడంతో యశ్వంత్ స్కూల్కు సరిగా వెళ్లడం లేదు. చెల్లి దివ్యాంగురాలు. ఈ పరిణామాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
News October 17, 2025
నెల్లూరు: ఎందుకీ నిర్లక్ష్యం..!

నెల్లూరు జిల్లాలో PM కిసాన్ నిధుల పంపిణీ ఆలస్యం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది రైతులకు రూ.253.79 కోట్లను ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. గతేడాది వరకు 1.67 లక్షల మంది ఖాతాల్లో 3 విడతల్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే జమైంది. మరో రూ.150 కోట్లు జమవ్వాల్సి ఉంది. ఈకేవైసీ, బ్యాంక్ లింకేజీ, ఫిజికల్ రీ వెరిఫికేషన్ చేయకపోవడంతో దాదాపు 7 వేల మంది ఈ నిధులకు దూరంగా ఉన్నారు.
News October 17, 2025
జాతీయ రహదారి పనులపై కలెక్టర్ సమీక్ష

మంథని పట్టణంలో గురువారం కలెక్టర్ కోయ శ్రీ హర్ష విస్తృతంగా పర్యటించారు. ఎన్హెచ్ 163జీ నిర్మాణంలో భూ సేకరణ మిస్సింగ్ పరిహార సమస్యలను ఈనెల 24లోపు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. అక్టోబర్ 30లోపు మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో గ్రావెల్ పనులు పూర్తిచేయాలని సూచించారు. పర్యటనలో ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఎన్హెచ్ పీడీ కీర్తి భరద్వాజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.