News February 10, 2025

బత్తలపల్లి విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

image

విజయవాడలో ఆదివారం రాష్ట్ర స్థాయిలో వేదిక్ మ్యాథ్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వేదిక్ మ్యాథ్స్ లెవెల్-2 విభాగంలో బత్తలపల్లికి చెందిన విద్యార్థిని అద్విక ద్వితీయ బహుమతి గెలుచుకుంది. అనంతరం విశ్వం సీఈవో హరిచరణ్ చేతులపై ప్రశంసా పత్రం, కప్పు అందుకుంది. హైద్రాబాద్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయిందని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ తెలిపారు.

Similar News

News February 8, 2026

రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం: మంత్రి తుమ్మల

image

రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వేములవాడలో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. 1000 బస్సులు మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో నడుస్తున్నాయని వెల్లడించారు. వేములవాడలో అభివృద్ధి మరింత వేగవంతం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

News February 8, 2026

GNT: రేపు ఎస్పీ ఆఫీసులో PGRS రద్దు

image

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాటి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్‌ను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు గమనించాలని చెప్పారు.

News February 8, 2026

ఒక్కసారి తప్పు చేస్తే ఐదేళ్ల శిక్ష: కేటీఆర్

image

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. “ఒక్కసారి ఓటు వేయడంలో తప్పు చేస్తే ఐదేళ్లు శిక్ష పడతాది” అంటూ ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆలోచించి, అభివృద్ధి చేసిన పార్టీకి ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ పాలన ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపుతుందని కేటీఆర్ అన్నారు.