News April 5, 2025
బదనకల్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ముస్తాబాద్ మండలం బాదనకల్ గ్రామంలోని ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ గణేశ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. పాతూరి మల్లమ్మ(54) గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగిన ఆమె వ్యాధి నయం కాలేదు. శుక్రవారం తన వ్యవసాయ పొలం వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 4, 2025
లాటరీలో రూ.60 కోట్లు గెలిచాడు

UAEలో నివసించే శరవణన్ వెంకటాచలం అనే ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. ‘బిగ్ టికెట్ అబుదాబి 280’ అనే లాటరీ లక్కీ డ్రాలో ఏకంగా 25 మి. దిర్హామ్స్(రూ.60 కోట్లు) గెలుచుకున్నారు. అబుదాబిలో నివసించే ఈయన OCT 30న ‘463221’ నంబరుతో ఉన్న టికెట్ కొనుగోలు చేశారు. నిన్న డ్రా తీయగా శరవణన్కు జాక్పాట్ తగిలింది. నిర్వాహకులు అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని, ఈమెయిల్లో కూడా సంప్రదిస్తామని తెలిపారు.
News November 4, 2025
ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఉద్యోగాలు

తూర్పు కోస్ట్ గార్డ్ రీజియన్ 14 సివిలియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI అర్హతగల అభ్యర్థులు DEC 8వరకు అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, వెల్డర్ తదితర పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష, ట్రేడ్/ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్:indiancoastguard.gov.in/
News November 4, 2025
HYD: BANKలో JOBS.. రెండ్రోజులే ఛాన్స్

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు ఎల్లుండితో ముగుస్తుంది. HYDలో 32 స్టాఫ్ అసిస్టెంట్లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి.
SHARE IT


