News July 11, 2024
బదీలీల ప్రక్రియను పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఖమ్మం జిల్లాలో పారదర్శకంగా జరగాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్‌లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఉద్యోగ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ బదిలీలకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నాలుగు సంవత్సరాలు ఓకే చోట పనిచేసిన వారిని బదీలీ చేస్తామని, జూలై 9 నుండి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 11, 2025
భద్రాద్రి: విధుల్లోనూ విడవని తల్లి ప్రేమ

తల్లి ప్రేమ ముందు ఏదీ పనికి రాదని మరోసారి నిరూపితమైంది. మంగళవారం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఏఎన్ఎంల ట్రైనింగ్‌కు పలువురు హాజరయ్యారు. ఇందులో భాగంగా పినపాకకు చెందిన ఏఎన్ఎం శ్రీ రేఖ తన ఐదు నెలల కుమారుడితో హాజరైంది. బుడ్డోడిని పడుకోబెట్టేందుకు ఆమె కలెక్టరేట్ ఆవరణలో చీరతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టి, విరామ సమయంలో వచ్చి లాలించారు. ఈ తల్లి ప్రేమను చూసి సహ ఉద్యోగులు అభినందిస్తున్నారు.
News February 11, 2025
ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు 4,089 మంది

KMM-NLG-WGL టీచర్ MLC ఎన్నికలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఖమ్మం జిల్లాలో మండలాల వారీగా ఓటర్ల వివరాలు ప్రకటించారు. ఖమ్మం 2474, సత్తుపల్లి 277, మధిర 203, సింగరేణి 177, వైరా 113, కల్లూరు 94, కామేపల్లి 85, ఏన్కూర్ 75, కొణిజర్ల 66, కూసుమంచి 66, వేంసూరు 65, పెనుబల్లి 63, ఎర్రుపాలెం 59, నేలకొండపల్లి 55, రఘునాథపాలెం 41, తల్లాడ 37, చింతకాని 36, ముదిగొండ 35, బోనకల్ 34, తిరుమలాయపాలెం 34 మంది ఉన్నారు.
News February 11, 2025
మధిర: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్

మంగళవారం తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల ప్రకారం.. ఏపీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ జైపూర్- చెన్నై ఎక్స్ ప్రెస్ కిందపడటంతో అతడి తల తెగిపోయింది. లోకో పైలట్ సమాచారంతో ఖమ్మం జీఆర్పి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.