News June 14, 2024
బద్వేలు: ప్రియురాలిని హత్య చేయబోయి.. ఆత్మహత్య

బద్వేలులో సాయికుమార్ రెడ్డి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనపై సీఐ యుగంధర్ రెడ్డి స్పందించారు. కలసపాడుకు చెందిన సాయి కుమార్ సిద్దమూర్తిపల్లెకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆమె సాయిని దూరం పెట్టింది. తన ప్రేమను నిరాకరించిదని ప్రియురాలిని హత్య చేయబోయిన సాయి.. అది బెడిసికొట్టడంతో తన అక్క ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News January 3, 2026
త్వరలోనే YVU కాన్వకేషన్.. గవర్నర్‌కు ఆహ్వానం.!

AP గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను శుక్రవారం YVU ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ విజయవాడలోని లోక్ భవన్లో కలిశారు. వర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి వీసీ గవర్నర్‌ను కలిశారు. ఇందులో భాగంగా 11, 12,13, 14వ కాన్వకేషన్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైవీయూ ప్రగతి గురించి వీసీ వివరించారు.
News January 3, 2026
ప్రొద్దుటూరు: స్కాంలో అందరికీ వాటాలు.. అందుకే గప్‌చుప్.!

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ <<18748515>>స్కాంలో<<>> అందరికీ వాటాలు ఉండడంతోనే చర్యలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బంక్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ నుంచి మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి, అధికార పార్టీ నేతలకు వాటాలు వెళ్తుండడంతోనే చర్యలు తీసుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ స్వైప్ ద్వారా, అప్పుల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టినా కేసు పెట్టకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
News January 3, 2026
కడప: KGBVల్లో పోస్టులకు దరఖాస్తులు.!

కడప జిల్లాలోని KGBVల్లో ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్-1 కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్-5, ANM-6, అకౌంట్-2, అటెండర్-4, వాచ్ ఉమెన్-1, ASST కుక్-5 ఖాళీలు ఉండగా టైప్-4లో వార్డెన్-1, పార్ట్ టైమ్ టీచర్-2 ఖాళీలు ఉన్నాయి. మహిళలకు మాత్రమే అవకాశం. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.


