News August 25, 2024
బద్వేలు: ప్లానింగ్ సెక్రటరీ సస్పెండ్
అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మడకలవారిపల్లె సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ శేఖర్‌ను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు, బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లె గ్రామంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా వాటిని అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Similar News
News September 12, 2024
కడప పోలీస్ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని గురువారం జిల్లా SP హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. శిక్షణా కేంద్రంలో పోలీస్ సిబ్బందికి ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారో, సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీ వివరాలు DTC ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్, ప్రిన్సిపల్ కార్యాలయం, పెరేడ్ గ్రౌండ్, జిమ్, తరగతి గదులను పరిశీలించారు.
News September 12, 2024
పోరుమామిళ్ల పోలీస్ స్టేషను తనిఖీ చేసిన డీఐజీ
పోరుమామిళ్ల పోలీస్ స్టేషను కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్లోని రికార్డులను ఆయన తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలోని క్రైమ్ రిపోర్ట్ గురించి సీఐని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పోలీసులకు ఆయన పలు సూచనలు చేశారు.