News April 6, 2024

బద్వేల్‌లో అత్యధిక మెజారిటీ భార్యా భర్తలదే..

image

బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019లో వైసీపీ తరఫున దివంగత జి.వెంకటసుబ్బయ్య 44734 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో దాసరి సుధ 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటితో గెలిచారు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక మెజారిటీ. తాజాగా వైసీపీ నుంచి దాసరి సుధ, కూటమి నుంచి బొజ్జ రోషన్న బరిలో ఉన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయం చెప్పండి.

Similar News

News November 20, 2025

నేడు ఎర్రగుంట్ల RTPPకి అసెంబ్లీ కమిటీ.!

image

నేడు ఎర్రగుంట్ల రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)ను రాష్ట్ర అసెంబ్లీ కమిటీ సభ్యులు సందర్శిస్తున్నారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్ కూన రవికుమార్ ఆధ్వర్యంలో 12 మంది కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లనున్నారు. RTPPలో విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ పనితీరు, బొగ్గు కొరత తదితర అంశాలపై కమిటీ పరిశీలించనుంది. కాగా RTPP అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News November 20, 2025

కడప: దీనీ ఇస్తిమాకు CMకి ఆహ్వానం

image

కడప నగరంలో 2026 జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కడప ముస్లిం పెద్దలు కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సంబంధిత అధికారులకు, శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా సూచించారన్నారు. అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.

News November 20, 2025

కడప జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత.!

image

కడప జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో డిసెంబర్ నెలలో మరింత ఎక్కువ చలి ప్రభావం ఉంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు.