News September 21, 2024
బద్వేల్: ఆత్మహత్యకు కారణమైన ఆరుగురికి జైలు శిక్ష
పదేళ్ల క్రితం కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ పంద్యాల వెంకట లక్ష్మమ్మ (38)ను ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన ఆరుగురికి శిక్ష పడింది. ఆ కేసు విషయంలో విచారణ జరిపిన బద్వేలు కోర్టు ఆధారాలు నిరూపితం కావడంతో ఆరుగురికి శుక్రవారం మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి పద్మశ్రీ శుక్రవారం తీర్పు ఇచ్చారని, కలసపాడు ఎస్సై చిరంజీవి తెలిపారు.
Similar News
News October 9, 2024
ముద్దనూరు వద్ద రైలు ఢీ.. యువకుడు మృతి
రైలు కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం ముద్దనూరులో చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామిరెడ్డి వివరాల ప్రకారం.. ముద్దనూరు మండలంలోని చింతకుంట సమీపంలో రైలు కిందపడి గుండి నాగేంద్ర (22) మృతి చెందాడు. ఇతను డ్రైవర్‌గా జీవనం సాగిస్తారన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల విరాలు తెలియాల్సిఉంది.
News October 9, 2024
కడప: జ్యోతి క్షేత్ర సమస్య కేంద్ర అటవీ శాఖ మంత్రి దృష్టికి
గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్రయులకు, భక్తులకు నిరంతరం అన్నదానం చేస్తున్న కాశినాయన క్షేత్రంలోని ఆలయ నిర్మాణాలను, అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన బుధవారం కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలసి జ్యోతిక్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
News October 9, 2024
కడపలో వాసవి అమ్మవారికి బిందె సేవ
కడప నగరంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కడప శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం అమ్మవారి శాలలో దసరా వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా బిందె సేవ నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బిందె సేవలో బిందెె సేవలో భాగంగా అమ్మవారిని ఊరేగించారు.