News March 21, 2025

బనగానపల్లెలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు.. ఆస్పత్రి సీజ్

image

బనగానపల్లెలో ఆయుష్ వైద్య అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బనగానపల్లెలో అనధికారికంగా, వైద్య అర్హతలు లేని నకిలీ వైద్యుడు సూర్య నాయుడును గుర్తించారు. పక్షవాతానికి వైద్యం చేస్తానంటూ ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్నాడనే ఫిర్యాదులు అందడంతో ఆయుష్ శాఖ అధికారులు డా.రవికుమార్, వాణి తనిఖీకి వెళ్లగా నకిలీ వైద్యుడు పరారయ్యాడు. ఆయుష్ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు.

Similar News

News April 20, 2025

ఆదోని మెడికల్ కాలేజీపై ఆరోగ్యశాఖ మంత్రి స్పందన

image

కర్నూలు జీజీహెచ్‌లో అవసరమైన ఐపీ బ్లాక్ నిర్మిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్‌ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదోని మెడికల్ కాలేజీని అన్ని వసతులతో వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

News April 19, 2025

వెల్దుర్తి: పేడ రంగు నీళ్లు తాగి వివాహిత మృతి

image

వెల్దుర్తి మండలం యల్.కొట్టాలలో విషాదం నెలకొంది. సుహాసిని అనే వివాహిత ఇంట్లో ఎవరు లేని సమయంలో పేడరంగు నీళ్లు తాగి ఇద్దరు పిల్లలతో సహా శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు హుటాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఇద్దరు పిల్లలు మాన్యశ్రీ (10), విలక్షణ (7) పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!