News October 26, 2024
బనగానపల్లె: చౌడమ్మను దర్శించుకున్న మల్టీ జోన్ 2 RJC

నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దేవదాయ -ధర్మాదాయ శాఖ మల్టీ జోన్ -2 రీజినల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ కామేశ్వరమ్మ, అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, R.S.రంగాపురం, E.O.రామాంజనేయులు, ఎస్.కొత్తూరు E.O రామకృష్ణ ఉన్నారు.
Similar News
News November 19, 2025
నేడే రైతు ఖాతాలో 2వ విడత నగదు జమ: కలెక్టర్

అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద ఇవాళ (మంగళవారం) రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుందని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఆదేశించారు.
News November 18, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ఆదోనిలోని NDBL జిన్నింగ్ & ప్రెస్సింగ్, దాదా పీర్ మిల్ యూనిట్లలో CCI ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ఏ.సిరి మంగళవారం పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డ్ అధికారులతో కలిసి కోనుగోలు కేంద్రాల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న వాటిపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించా. ఆమెతో పాటు జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మీ ఉన్నారు.