News May 18, 2024
బనగానపల్లె: దద్దనాల ప్రాజెక్టుకు 4 అడుగుల నీరు

బనగానపల్లె మండలం ఎర్రమల కొండల్లో శుక్రవారం రాత్రి అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా దద్దనాల ప్రాజెక్ట్ ఎగువన వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రధానంగా మద్దిలేటిస్వామి క్షేత్రం పరిధిలో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన నీటిప్రవాహంలో అడుగంటిన దద్దనాల ప్రాజెక్టుకు 4 అడుగుల నీరు చేరింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News September 15, 2025
నిజంగా రూ.1200కు ఉల్లి కొన్నారా?: SV

చంద్రబాబు సర్కారుకు ఉల్లి రైతుల కష్టాలు కనిపించవా? అని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిజంగా రూ.1,200తో ఉల్లిని కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు రోడ్లపై పడేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
News September 14, 2025
కర్నూలు: ‘ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి’

ప్రతి ఒక్కరు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సండేస్ ఆన్ సైక్లింగ్’ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని, ప్రతి ఆదివారం పోలీసులు సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారు.
News September 14, 2025
కర్నూలు జిల్లా MPకి 15వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు 15వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 70 ప్రశ్నలు అడగటంతోపాటు 7 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 91.18గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.