News December 16, 2024
బనగానపల్లె విద్యార్థులకు బంపర్ ఆఫర్

బనగానపల్లె నియోజకవర్గ విద్యార్థులకు మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నంద్యాల జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థికి రూ.లక్ష నగదు బహుమతి అందిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ప్రథమ ర్యాంక్ సాధించిన వారికి రూ.50 వేలు అందజేస్తామని ప్రకటించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
Similar News
News February 27, 2026
358 మంది విద్యార్థుల గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. మొత్తం 5,069 మంది విద్యార్థులకు గానూ 4,711 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.
News February 27, 2026
‘కర్నూలు జిల్లాలో పుష్కలంగా ఎరువుల నిల్వలు’

2025-26 రబీ సీజన్‌కు సంబంధించి కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత లేదని, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లా అవసరాల కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అంచనా వేయగా, ప్రస్తుతం 25,635 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 27, 2026
బాలిక హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.


