News November 21, 2024
బనవాసిలో 77 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు: మంత్రి సవిత
ఎమ్మిగనూరు (మం) బనవాసిలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు చేనేత, జౌళి శాఖ 91 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో TDP ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. నిబంధనల మేరకు మూడేళ్లలో ఈ భూమిని వినియోగించకపోవడంతో 2020లో కర్నూలు కలెక్టర్ ఈ కేటాయింపులు రద్దు చేసి, పేదల ఇళ్ల స్థలాలకు 13.96 ఎకరాలను కేటాయించారన్నారు. మిగతా 77 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి పేర్కొన్నారు.
Similar News
News December 11, 2024
అన్నదాతకు అండగా ఉద్యమిస్తాం: కాటసాని
అన్నదాతలకు అండగా నిలబడి ఉద్యమిస్తామని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలులోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిసెంబరు 13న రైతుల కోసం.. రైతులతో కలిసి నంద్యాలలోని ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు.
News December 11, 2024
నందికొట్కూరులో బాలికకు నిప్పు ఘటనలో బిగ్ ట్విస్ట్
నందికొట్కూరులో బాలికకు నిప్పు పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. లహరి (17) మృతికి అగ్నిప్రమాదమే కారణమని జిల్లా ఎస్పీ అధిదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. లహరి, రాఘవేంద్ర ఇంట్లో ఉన్న సమయంలో దోమల కాయిల్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందన్నారు. గదిలో ఉన్న టర్పెంట్ ఆయిల్, ప్లాస్టిక్ వస్తువులు ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనలో బాలిక మృతి చెందగా, యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
News December 11, 2024
అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దు: ఎస్పీ
అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేస్తే వారు మీ కాల్‌ను రికార్డు చేసి పోలీసు కేసులో ఇరికిస్తామని బెదిరిస్తారన్నారు. వేధింపులకు గురిచేసి మీ డబ్బులు దోచేస్తారని, అటువంటి సైబర్ నేరగాళ్ల వలలో పడకూడదని ప్రజలను సూచించారు. సైబర్ నేరాలపై 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.