News February 16, 2026

బనారస్ హిందూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

image

<>బనారస్<<>> హిందూ యూనివర్సిటీలో 21 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. కన్సల్టెంట్, RA, SRF, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి PhD(సాయిల్ సైన్స్& అగ్రికల్చర్ కెమిస్ట్రీ, జియోగ్రఫీ), డిప్లొమా జియో ఇన్ఫర్మాటిక్స్, డిగ్రీ, MSc(అగ్రికల్చర్), MA(జియోగ్రఫీ), BSc(అగ్రికల్చర్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bhu.ac.in

Similar News

News March 17, 2026

మత మార్పిడులపై ఉక్కుపాదం.. కీలక బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం

image

బలవంతం, మోసం, ప్రలోభం, వివాహాల ద్వారా జరిగే మత మార్పిడులను నిషేధించే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్-2026కు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తారు. మైనర్, SC, ST, మహిళలు, రోగులతోపాటు సామూహిక మత మార్పిడులకు పాల్పడితే అదనంగా రూ.5 లక్షలు ఫైన్ ఉంటుంది. పదేపదే ఇవే నేరాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల జరిమానా విధిస్తారు.

News March 17, 2026

ఇరాన్ సుప్రీంలీడర్ స్వలింగ సంపర్కుడు: US

image

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ స్వలింగ సంపర్కుడని US ఇంటెలిజెన్స్ భావిస్తోంది. తన చైల్డ్‌హుడ్ ట్యూటర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఇదే విషయాన్ని ట్రంప్‌తో చెప్పగానే ఆయన ఆశ్చర్యంతో బిగ్గరగా నవ్వాడని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. వికీలీక్స్‌లోనూ ఓ ఇరాన్ లీడర్ నపుంసకత్వానికి చికిత్స కోసం UKకు వెళ్లినట్లు పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. కాగా ఇరాన్‌లో స్వలింగ సంపర్కం నేరం.

News March 17, 2026

BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు

image

కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం, వెండి ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,58,620కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,45,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు పెరిగి రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.