News October 9, 2024
బన్ని ఉత్సవాలకు పోలీసు బందోబస్తు: ఎస్పీ
12న జరిగే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాలకు 800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఏడుగురు డీఎస్పీలు, 42 మంది సీఐలు, 54 మంది ఎస్సైలు, 112 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 362 మంది కానిస్టేబుళ్లు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 3 ప్లటూన్ల ఏఆర్ పోలీసులు, 95 మంది హోంగార్డులు విధుల్లో ఉంటారన్నారు.
Similar News
News November 2, 2024
నదీ తీర ప్రాంతాల దగ్గర అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజాము నుండే శైవ ఆలయాలకు, నదీ తీర ప్రాంతాలు, వంకలు, చెరువులలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లే భక్తులకు కర్నూలు ఎస్పీ కీలక సూచనలు చేశారు. తమ వెంట చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలను తీసుకొని వెళ్తే.. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్నూలులో కార్తీక దీపాలు వదిలే వినాయక్ ఘాట్, ఓర్వకల్లు శ్రీ కాల్వబుగ్గ రామేశ్వరం శివాలయం, తదితర చోట్ల భక్తుల జాగ్రత్తగా ఉండాలన్నారు.
News November 1, 2024
రూ.2,800 కోట్లతో ఓర్వకల్ పారిశ్రామిక వాడ అభివృద్ధి: మంత్రి భరత్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2,800 కోట్లతో ఓర్వకల్ పారిశ్రామిక వాడ అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ 6 హామీల అమలులో భాగంగా దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ నాగరాజు, జాయింట్ కలెక్టర్ బీ.నవ్య పాల్గొన్నారు.
News November 1, 2024
దీపం-2 పథకం ద్వారా పేదల జీవితంలో వెలుగులు: మంత్రి
సీఎం చంద్రబాబు దీపం-2 పథకం ద్వారా పేదల జీవితంలో వెలుగులు నింపుతున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో దీపం పథకం-2 (ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ నాగరాజు, జాయింట్ కలెక్టర్ బీ.నవ్య పాల్గొన్నారు.