News October 5, 2024
బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. శనివారం దేవరగట్టును ఆయన సందర్శించి మాట్లాడారు. పండుగను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా జరుపుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు గట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Similar News
News December 6, 2025
కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త.!

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.
News December 6, 2025
కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి: ఐజీ ఆకే రవికృష్ణ

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఐజీ ఆకే రవికృష్ణ ఆకాంక్షించారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల జడ్పీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఆకే రవికృష్ణ వర్చువల్‌లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యసాధన దిశగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుకు సహకరించాలన్నారు.