News March 18, 2025
బయ్యారం: కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్య

కాకతీయ నగర్ కాలనీలో ఓ విద్యార్థి సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలోని ఓ కళాశాలలో అజ్మీర మహేశ్(18) ఫిజియో థెరఫీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హోలీ పండగ సందర్భంగా సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News April 18, 2025
HYD: SUMMER బయట పడుకుంటున్నారా?

HYD ప్రజలకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. వేసవితాపాన్ని తట్టుకోలేక తలుపులు తీసి వరండాల్లో, స్లాబ్‌పైన పడుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక్కరైనా పడుకునేలా చూసుకోవాలని, మీ ఆభరణాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని, దొంగల ముఠాలు ఇదే అవకాశంగా తీసుకుని దోచేస్తారని వివరించారు. అపరిచితులను గుర్తిస్తే 100, 112, 8712662111 కాల్ చేయాలని సూచించారు.
News April 18, 2025
JEE మెయిన్ ‘కీ’ తొలగించిన NTA

JEE మెయిన్ ఫలితాల విడుదల వేళ విద్యార్థులను NTA అయోమయానికి గురి చేస్తోంది. ఇవాళ సాయంత్రం అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ కీ విడుదల చేసి, కొద్దిసేపటికి దాన్ని తొలగించింది. దీంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఇవాళ రిజల్ట్స్ వెల్లడించనున్నట్లు ప్రకటించగా, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై NTAపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
News April 18, 2025
పాలమూరులో నేటి ముఖ్యంశాలు!

✔ఇంగ్లిష్ టీచర్ కళ్యాణి సస్పెండ్:NGKL డీఈవో✔కార్మిక చట్టాలు నిర్వీర్యం: సీఐటీయూ ✔పరిశ్రమలపై నాగర్‌కర్నూల్ ఎంపీ చర్చ ✔BJPకి కాంగ్రెస్ భయం పట్టుకుంది:చిన్నారెడ్డి✔బీసీ చైతన్య సభ పోస్టర్ ఆవిష్కరణ✔పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి:TUCI✔NRPT: Way2News కథనానికి స్పందన.. ‘మొసలిని బంధించారు’✔‘పీయూ RTF కోర్స్ ఫీజులు విడుదల చేయాలి: విద్యార్థులు