News February 3, 2025
బయ్యారం: చిన్నారిపై వృద్ధుడి అసభ్య ప్రవర్తన

చిన్నారిపై వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తన ఘటన బయ్యారం(M)లో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన వృద్ధుడు చెన్నయ్య ఇంటి సమీపంలోని చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు మందలించారు. ఈ క్రమంలో ఆదివారం చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉండటంతో మద్యం మత్తులో వికృతచేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.
Similar News
News February 28, 2026
ప.గో మూడు నెలల జీతాలు విడుదల.. Way2News ఎఫెక్ట్

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వేతనాల నిలిపివేతపై Way2News వచ్చిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. సభ్యుల ఆర్థిక ఇబ్బందులను జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మశ్రీ సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం తక్షణమే మూడు నెలల బకాయి వేతనాలను విడుదల చేసింది. ప్రభుత్వ సత్వర నిర్ణయం పట్ల ఉమ్మడి జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 28, 2026
పారిశుద్ధ్య పర్యవేక్షణలో ఐసీసీసీ కీలకం: కలెక్టర్

వరంగల్ నగర పారిశుద్ధ్య నిర్వహణలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) పాత్ర అత్యంత కీలకమని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం బల్దియా కార్యాలయంలోని ఐసీసీసీ కేంద్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. శానిటేషన్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
News February 28, 2026
ఖమ్మం: గైర్హాజరు, నిర్లక్ష్యం.. 50 మంది టీచర్లకు నోటీసులు

ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 50 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై డీఈవో చైతన్య జైని శుక్రవారం చర్యలు చేపట్టారు. కారణం లేకుండా గైర్హాజరైన 24 మందికి, అనుమతి లేకుండా ఓడీ పేరుతో గైర్హాజరైన 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దెందుకూరు జడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదుల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. ఏన్కూరు ఎంపీపీ స్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేశారు.


