News February 3, 2025
బయ్యారం: చిన్నారిపై వృద్ధుడి అసభ్య ప్రవర్తన

చిన్నారిపై వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తన ఘటన బయ్యారం(M)లో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన వృద్ధుడు చెన్నయ్య ఇంటి సమీపంలోని చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు మందలించారు. ఈ క్రమంలో ఆదివారం చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉండటంతో మద్యం మత్తులో వికృతచేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.
Similar News
News February 12, 2026
బాపట్ల: వీఆర్వో పై కలెక్టర్ ఆగ్రహం

సచివాలయ సిబ్బంది విధిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆయన అరుంబాక సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీఆర్వో సుబ్బారావు హాజరు నమోదు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందికి ప్రజా సేవలపై అవగాహన లోపించడంపై ఆర్డీవో, తహశీల్దార్‌లను ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘దిగంబర’’

దిగంబర అంటే దిక్కులే వస్త్రాలుగా కలిగినవాడు అని అర్థం. దీని అంతరార్థం.. శివుడు ఏ బంధాలకు, భౌతిక వస్తువులకు లొంగడు. ఆయనకు మోహమనేదే లేదు. అనంతమైన ఈ ఆకాశం, 8 దిక్కులే ఆయనకు వస్త్రాలు. అంటే ఈ విశ్వమంతా ఆయనలోనే ఉంది. ఆయనలో ఏమీ దాగి లేదు అని అర్థం. శ్మశానంలో భస్మాన్ని పూసుకుని ఉండటం ద్వారా, ఈ శరీరం నాశనమయ్యేదని, ఆత్మ మాత్రమే శాశ్వతమని ఆయన లోకానికి చాటిచెబుతాడు. ఆయన పరిపూర్ణ వైరాగ్యానికి ఇది నిదర్శనం.
News February 12, 2026
వనపర్తి: కౌంటింగ్ ప్రక్రియను నిష్పాక్షికంగా నిర్వహించాలని వినతి

వనపర్తి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అధికారులు నిస్పాక్షికంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో నేతలు జిల్లా కలెక్టర్‌కు ఈరోజు వినతిపత్రం ఇచ్చారు. గత పంచాయతీ ఎన్నికల్లో అధికార యంత్రాంగం సవాయిగూడెం, సోలీపూర్ పంచాయితీ ఎన్నికల కౌంటింగ్‌లో ఏకపక్షంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ లక్ష్మయ్య, పరంజ్యోతి, గులాం ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు.


