News February 3, 2025

బయ్యారం: చిన్నారిపై వృద్ధుడి అసభ్య ప్రవర్తన

image

చిన్నారిపై వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తన ఘటన బయ్యారం(M)లో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన వృద్ధుడు చెన్నయ్య ఇంటి సమీపంలోని చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు మందలించారు. ఈ క్రమంలో ఆదివారం చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉండటంతో మద్యం మత్తులో వికృతచేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.

Similar News

News March 5, 2026

దిలావర్పూర్: జాతీయ స్థాయిలో స్నేహితకు కాంస్య పతకం

image

దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన చిట్టి స్నేహిత జాతీయస్థాయి కరాటే పోటీల్లో కాంస్య పతకం సాధించి ఊరికి పేరు తెచ్చింది. జామ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఈమె, హనుమకొండలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్-2026లో ప్రతిభ చాటింది. స్నేహిత సాధించిన విజయానికి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని విద్యార్థినిని అభినందించారు.

News March 5, 2026

10 సార్లు సీఎం.. ఇక శకం ముగిసినట్లే!

image

బిహార్‌లో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు నితీశ్ పేరిట ఉంది. ఏకంగా 10 సార్లు ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి 2000 సం.లో కేవలం 7 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2005, 10, 15 (2 సార్లు), 17, 20, 22, 24, 25లో CM కుర్చీ ఎక్కారు. OBCలు, మహిళల మద్దతుతో పాటు వివిధ పార్టీలతో పొత్తుల ద్వారా ఎక్కువ కాలం సీఎంగా కొనసాగారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్‌లో ఆయన శకం ముగిసినట్లే భావించాలి.

News March 5, 2026

కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 5,236 మంది హాజరు.!

image

కడప జిల్లాలో గురువారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ తెలుగు, హిందీ, ఉర్దు పరీక్షలు నిర్వహించారు. నేడు 5,783 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 5,326 మంది విద్యార్థులు హాజరయ్యారు. 711 మంది గైర్హాజరయ్యారు. తెలుగు 5,086 మంది, హిందీ 68 మంది, ఉర్దు పరీక్ష 82 మంది రాశారు. డీఈఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.