News March 18, 2025

బయ్యారం: పరీక్షల భయంతో విద్యార్థి ఆత్మహత్య

image

కాకతీయ నగర్‌ కాలనీలో సోమవారం అజ్మీర(సాయి) మహేశ్(18) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మృతుడు సిద్దిపేట జిల్లాలోని ఓ కళాశాలలో ఫిజియో థెరఫీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హోలీ పండుగ సందర్భంగా సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

నువ్వుల పంటలో రసం పీల్చే పురుగులు – నివారణ

image

నువ్వుల పంటను పేనుబంక, పచ్చదోమ, తెల్లనల్లి, తామర పురుగులు ఆశించి ఆకుల అడుగుభాగాన చేరి రసం పీలుస్తాయి. ఫలితంగా ఆకులు వాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. పేనుబంక, తామరపురుగు, పచ్చదోమ నివారణకు KG విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోఫ్రిడ్‌తో విత్తనశుద్ధి చేయాలి. లీటరు నీటికి డైమిథోయేట్ 1.6ml లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేయాలి. తెల్లనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml కలిపి పిచికారీ చేయాలి.

News February 24, 2026

శ్రీకాకుళం: బంగారం చోరీ చేసిన విద్యార్థులు

image

శ్రీకాకుళంలోని ఎల్బీఎస్ కాలనీకి చెందిన ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. నగరంలో ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంట్లో చొరబడి 2తులాల బంగారం, రూ. 4వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఆశ్రయించగా వన్ టౌన్ సీఐ పైడాపునాయుడు వారిని పట్టుకున్నారు. విద్యార్థులు మైనర్లు కావడంతో తల్లితండ్రులు అభ్యర్థన మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

News February 24, 2026

కలుపు తీయనివాడు కోత కోయడు

image

సాగులో ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. రైతులు సరైన సమయంలో కలుపును తొలగించకపోతే, అది ప్రధాన పంటకు చేరాల్సిన పోషకాలను లాగేసుకొని పంట సరిగా పెరగదు. నిర్లక్ష్యం చేస్తే రైతుకు కోసేందుకు పంట కూడా మిగలదు. అలాగే నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను (కలుపును) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది.